అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి డిసెంబర్ 12న చింతనలంక గ్రామంలో విద్యుత్ ప్రమాదం వల్ల ఇళ్ళు అగ్నికి అహుతి కావడంతో సర్వం కోల్పోయిన కుటుంబానికి జనసేన నాయకులు మరియు ప్రవాసాంధ్రులు పెనుమాల జాన్ బాబు మరియు మొగళ్ళ చంద్రశేఖర్ ల ఆర్థిక సహకారంతో వారి కుటుంబానికి గోడి గురుకుల పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్, దళిత నాయకులు డాక్టర్ కోట హనుమంతురావు చేతుల మీదుగా బియ్యం మరియు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్బంగా జాన్ బాబుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.