*మానవత్వం చాటిన బి లక్ష్మన్న
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం బదినేహాల్ గ్రామానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు ఎర్రి స్వామికి యాక్సిడెంట్ జరిగిన విషయం తెలుసుకున్న మంత్రాలయం జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బి లక్ష్మన్న స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఎర్రి స్వామికి ₹5000 ఆర్థిక సహాయం అందజేసిన బి లక్ష్మన్న, గాయాలపై విచారించడంతో పాటు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. స్కూటర్‌పై వెళ్తుండగా జరిగిన స్కిడ్ ప్రమాదంతో గాయపడిన స్వామి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దకడబూర్ జనసేన ఇంచార్జ్ బజారి (అబ్రహం), జాలాడి శ్రీను కూడా పరామర్శలో పాల్గొన్నారు. జనసేన కార్యకర్తల పట్ల అండగా ఉండే నాయకత్వాన్ని మానవతా దృక్పథంతో మరోసారి చాటారు బి లక్ష్మన్న.
Share this content:
Post Comment