ప్రమాదానికి గురైన వ్యక్తికి జనసేన ఆర్ధిక చేయూత

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, సూరాపురం గ్రామంలో ఇటీవల ప్రమాదానికి గురైన మారిశెట్టి సత్యనారాయణ కుమారునికి వైద్య ఖర్చుల నిమిత్తం నిడదవోలు, సూరాపురం గ్రామ జనసేన ఆధ్వర్యంలో 20,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం, నిడదవోలు మండల ఉపాధ్యక్షులు మేడా పూర్ణచంద్రరావు, సూరాపురం గ్రామ అధ్యక్షులు వద్దిరెడ్డి శివ, గణపతి రాజు, మండల సంయుక్త కార్యదర్శి గుంటుపల్లి శీను, ముత్యాల పోసి, కాకర్ల వెంకన్న, హరిదాసు రాము, దాసరి రాంపండు, మాన్యం మణి, గుంటుపల్లి దుర్గ ప్రసాద్, కోలా సంతోష్ కుమార్, గడ్డం దుర్గారావు, దొరా మణి, పూటీ పోసియ్య మరియు సూరపురం గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.