జనసేనాని స్ఫూర్తితో వావిలాపల్లి కిరణ్ కౌలు రైతులకు ఆర్థిక సాయం

శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం, రేగిడి ఆమదాలవలస మండల పరిధిలో నాయారాలవలస గ్రామంలో అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆదివారం వావిలాపల్లి కిరణ్ తన వంతు కౌలు రైతులకు భరోసా నింపడానికి ఏ కౌలు రైతుకూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా ఉండడానికి రైతు పెట్టుబడి సాయం కింద 5000/- లను 20 మంది కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందజేశారు. అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రతి సంవత్సరం కూడా ఇదేవిధంగా 100000/-లును కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తానని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని, రాజాం నియోజకవర్గం నాయకులు ఎన్ని రాజు, ఎచ్చెర్ల నాయకురాలు కాంతిశ్రీ , రాజాం నియోజకవర్గం నాయకులు కరణం మనోజ్, రాజాం నియోజవర్గ జనసైనికులు, వీర మహిళలు పాల్గొని నాయారాలవలస గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం, కుమ్మరి అగ్రహారం గ్రామంలో జెండా ఆవిష్కరణ మరియు భారీ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది.