ఫార్మా బాధితులకు న్యాయం చేయాలి: పెందుర్తి జనసేన

వైజాగ్: మంగళవారం రాత్రి పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా కంపనీలో లారస్ యూనిట్-3 సంస్థలో అగ్ని ప్రమాదం జరగడం వలన నలుగురు కార్మికులు మరణించడం జరిగింది. నేడు ప్రమాదం జరిగిన ప్రదేశంకు వెళ్లి, ప్రమాదంకు గల కారణాలను కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి తెలుసుకొని పరిశీలించడం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన వారికి ఒకొక్కరికి నష్టపరిహారంగా 50 లక్షల రూపాయలును ఇవ్వాలని అలాగే చికిత్స పొందుతు వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని డిమాండ్ చెయ్యడం జరిగింది. సేఫ్టీ ఆడిట్ లను సంక్రమంగా నిర్వహిస్తూ, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలో భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని చెప్పడం జరిగింది. అధికార వైసీపీ పార్టీ నిర్లక్యం వలన అలాగే పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ నిర్లక్ష్యం వలన, కంపెనీ యాజమాన్యం, సేఫ్టీ డిపార్ట్మెంట్, పరిశ్రమల ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం వల్లనే తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని, బాధితుల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యులు కోన తాతారావు, పెందుర్తి నియోజకవర్గ వర్గం నాయకురాలు గొన్న రమాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ వర్గం నాయకులు కార్యకర్తలు అర్జిల్లి అప్పలరాజు, మెడిసెట్టి విజయ, సర్వసిద్ది సన్యాసి రాజు, దాసరి రమేష్, దాసరి శ్రీను, బొంది దుర్గారావు, సమ్మంగి అప్పారావు, బొంది ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.