*బాధితుడికి భరోసానిచ్చిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలంలో జరిగిన అగ్నిప్రమాదం హృదయవిదారకంగా మారింది. మోహన్ ట్రేడర్స్ అనే ఎరువుల దుకాణంలో చెలరేగిన మంటలతో భారీ ఆస్తినష్టం చోటుచేసుకుంది. సంఘటన సమాచారం తెలుసుకున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధితుడు మోహన్ రెడ్డిని పరామర్శించి అతనికి ధైర్యం చెప్పారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టాన్ని చూస్తే తీవ్ర ఆవేదన కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తరఫున బాధితుడికి అండగా ఉంటామని, అన్ని విధాలుగా సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మండల జనసేన అధ్యక్షుడు పుర్రం శెట్టి రవి, నాయకులు సంజీవరెడ్డి, ఎర్రి స్వామి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రమణారెడ్డి, బెస్త శ్రీనివాసులు, డిష్ రాజు, వెంకటస్వామి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment