పెళ్లైన తర్వాత తొలి హోలీ

దేశ వ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం హోలీ పండుగని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక గత ఏడాది గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లైన తర్వాత తొలి హోలీ పండుగ జరుపుకుంది. అనంతరం హోలీ పండుగ తమ జీవితంలో సంతోషకరమైన రంగులు వెదజల్లుతోందని చెబుతోంది కాజల్.

చిన్నప్పటి నుంచి హోలీ పండుగకు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని అంటుంది కాజల్‌. పెళ్లైన తర్వాత వచ్చిన తొలి హోలీ ఇది కాబట్టి ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నాను అంటుంది కాజల్. కోవిడ్ వలన పరిమితంగా జరుపుకుంటున్నట్టు పేర్కొంది. హోలీ సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. హోలీ సందర్భంగా ఈ రోజు కాజల్ ఇంట్లో హడావిడి ఓ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఆచార్య అనే సినిమాతో బిజీగా ఉంది.