‘టక్‌ జగదీష్‌’ నుంచి ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల‌!

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన కొత్త చిత్రం ‘టక్‌ జగదీష్‌’ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా నుంచి ఇటీవ‌ల వ‌చ్చిన టీజ‌ర్ అల‌రించింది. తాజాగా ఈ సినిమా నుంచి కోలో కోలన్న కోలో కొమ్మ‌లు కిల‌కిల న‌వ్వాలి పాట‌ను విడుద‌ల చేశారు.

ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాయ‌గా, త‌మ‌న్ సంగీతం అందించారు. ఈ సినిమాలో  రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను షైన్స్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. నాని, శివ నిర్వాణ కాంబినేషన్‏లో వ‌స్తున్న ఈ సినిమా వ‌చ్చేనెల 23న విడుదల కానుంది.