మున్సిపల్ కమీషనరుకు జనసేన వినతి

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గంలో గత వారం రోజులుగా పాలకొండ గారమ్మ కాలనీలో ఉన్నటువంటి 0.25 సెంట్ల ఖాళీ స్థలాన్ని కొందరు వైసీపీ నాయకులు అండదండలతో ప్రజా ప్రతినిధులు ఆ స్థలాన్ని కబ్జా చేసుకునేందుకు పన్నాగం పన్ని వేరే వ్యక్తి ద్వారా ఆ స్థలంలో మట్టితో చదును చేస్తున్న సమయంలో జనసేన పార్టీ నాయకులు పోరెడ్డీ ప్రశాంత్ అడ్డుకోవడం జరిగింది. ఇది కాలనీ వాసుల అవసరార్థం సామాజిక కార్యక్రమాలు మరియు పిల్లలు ఆట స్థలంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం ఈ స్థలాన్ని కేటాయించిందని అలాంటి స్థలాన్ని మీరు ఎంత మాత్రం భాగ్యం కాదని వెంటనే విషయాన్ని పై అధికారులకు తెలియజేశారు. మరుసటి రోజు ఎమ్మార్వో సచివాలయం సిబ్బంది వచ్చి స్థలాన్ని పరిశీలించి దీనిపై కబ్జాకి పాల్పడే వారిపై అధికారికంగా పూర్తి చర్యలు తీసుకుంటామని తెలియజేసి ఆ స్థలంపై వేస్తున్న మట్టిని చదును చేసే పని అక్కడితో ఆపేయడం జరిగింది. ఇది తెలుసుకున్న ప్రజాప్రతినిధులు రాత్రి సమయంలో పోరెడ్డి ప్రశాంత్ వాళ్ళ ఇంటి మీదకు వెళుతూ శారీరిక దాడికి పాల్పడ్డారు జనసైనికులు పోలీస్ స్టేషన్లో ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు చేయుటకు వెళ్లారు. ఎస్సై కూడా వారిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు మరుసటి రోజు సబ్ కలెక్టర్ పూర్తిగా స్థలాన్ని పరిశీలించి ఈ 25 సెంట్లు భూమి కాలనీవాసులు అవసరార్థం వినియోగించుకోవాలనీ దానికి తగ్గట్టుగా అన్ని డాక్యుమెంట్ లు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కి, ఎమ్మార్వోకి ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి మొక్కలు నాటి ఆ వీడియోలు తనకు పంపమని ఆదేశించారు. ఆ స్థలం తమకు వచ్చిందని దగ్గరుండి బాధ్యత వహించిన పాలకొండ జనసేన పార్టీ నాయకులు పొరెడ్డి ప్రశాంత్ ను కాలనీవాసులు అందరూ ప్రశంసించారు. అలాగే ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతుందని పాలకొండ నియోజకవర్గ జనసేన నాయుకులకు తెలియజేయడంతో శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంకి వెళ్లి కమిషనర్ తో మాట్లాడి ఆ ప్రదేశంలో వేసిన మట్టిని చదును చేసేందుకు చర్యలు తీసుకోవాలని అవసరమైతే దానికి అయ్యే ఖర్చు మేము భరిస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే ప్రశాంత్ పై దాడి జరగడాన్ని ఖండిస్తూ తనకు ఏ సమయంలోనైనా ఏ విధమైన బెదిరింపులుగాని ఆటంకం కానీ జరిగిన పాలకొండ నియోజకవర్గం నుంచి వచ్చి నీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమం అంతా ఒక్కడిగా ఉంది స్థలాన్ని కాలనీవాసులకు చెందే విధంగా చేసినందుకు అందరూ అభినందనలు తెలిపారు. పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు నుండి ఇది మొదటి విజయంగా స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నాలుగు మండలాల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.