తోటపల్లి ఎడమ కాలువ పరిశీలనలో మత్స పుండరీకం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో తోటపల్లి ఎడమ కాలువ అనుబంధం (సబ్‑చానల్) పనులను రైతులతో కలిసి పరిశీలించిన జనసేన వాలంటీర్ మత్స పుండరీకం. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్ని విన్నపాలు చేసినా కూడా ఈ కాలువ పనులు ప్రారంభం కాలేదని ఆయన అన్నారు. మరియు ఇప్పుడు, కూటమి ప్రభుత్వం రాజీనితి మార్పుతో అన్నదాతలకు సాగునీటి అందించారు. పంటకాలువ ద్వారా వచ్చే నీటితో రైతులు ఆనందంగా ఉందని, “రైతుకే దేశం బాగుంటుంది” అంటూ పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000, కూటమి ప్రభుత్వం ద్వారా మరో 14,000 జతచేయబడి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా త్వరలో బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలు రైతులు, స్థానికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment