మత్స్యకార అభ్యున్నతి యాత్రను జయప్రదం చేయాలి: పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో మత్స్యకార అభివృద్ధి యాత్ర చేపట్టనున్నట్లు జనసేన పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ తెలిపారు. తాళ్లరేవు మండలం జి. వేమవరం లో స్థానిక సర్పంచ్ పుణ్యవంతులు సూరిబాబు స్వగృహం వద్ద నియోజకవర్గ స్థాయి సమావేశం పితాని బాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. యాత్రకు సంబంధించిన సన్నాహకాలలో భాగంగా ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తాళ్ళరేవు మండలంలోనీ చొల్లంగి, చొల్లంగిపేట, మట్లపాలెం మహా లక్ష్మమ్మ గుడి సమీపంలో పాదయాత్ర జరుగనుందని తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్ర పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటన సందర్భంగా ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జీ.వేమవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ పుణ్యమఒతుల సూరిబాబు ఇంటివద్ద సమావేశంలో రాష్ట్ర పిఎసి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో యాత్ర సన్నాహకాలపై చర్చించారు. అనంతరం తాళ్లరేవు మండల కమిటీ నూతన కార్యవర్గాన్ని పితాని బాలకృష్ణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సాన బోయిన మల్లికార్జున రావు, మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, పుణ్యమఒతుల సూరిబాబు, గుద్దటి జమ్మీ, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండల అధ్యక్షులు మద్దింశెట్టి రామకృష్ణ, గొలగోటి వెంకన్న బాబు, మోకా బాల ప్రసాద్, విళ్ళ వీర, ముత్యాల జయలక్ష్మి, గండి అనిల్, టేకుమూడి త్రిమూర్తులు, జి.అనిల్, దుర్గాప్రసాద్, పుణ్యమంతుల చినబాబు, విళ్ళ వీర, ఏసూరి వరప్రసాద్, పెసింగి జడేజా తదితరులు పాల్గొన్నారు.