వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి: ధనుంజయ

గుంతకల్: వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని జనసేన పార్టీ పామిడి మండల అధ్యక్షులు ధనుంజయ డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ధనుంజయ మాట్లాడుతూ వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ వేసినటువంటి ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, అవి రాజకీయ గొడవలకు దారి తీయొచ్చని కావున వాటిని వెంటనే తీసివేయించాలని పామిడి పట్టణ సిఐ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది. ప్రజాధనంతో ప్రభుత్వమే ఏర్పాటు చేసినందువల్ల ఒకవేళ తీయని పక్షంలో కచ్చితంగా జనసేన పార్టీ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుంది. మా నాయకుడిని కించపరిస్తే ఎటువంటి పరిస్థితులలో మేము సహించం అది మమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. ప్రజలని పాలించవలసిన ప్రభుత్వం అలాంటి పనులను మానేసి విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రతిపక్ష నాయకులను కించపరుస్తూ రాజకీయ గొడవలను సృష్టించాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు ఉంది. ప్రజలు పరిపాలన గురించి చర్చించుకోవడం మానేసి, ఇలాంటి గొడవలు చుట్టూ రాజకీయాలను నడపాలన్న ఉద్దేశంతోనే ఇలా రెచ్చగొట్టే విధంగా అవహేళనలు చేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తోందని అర్థమవుతుంది. ప్రభుత్వం వెంటనే ఫ్లెక్సీలను తీసివేయాలని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామని ధనుంజయ డిమండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జగదీష్, శక్షావలి కార్యదర్శులు అబ్దుల్, భాస్కర్ గౌడ్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.