మామిడికుదురు జనసేన ఆధ్వర్యంలో పూలే జయంతి

మామిడికుదురు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల నిర్మూలన, అంటరానితనం, మహిళల హక్కుల కోసం, వెనుకబడిన తరగతుల వారి విద్య కోసం, ఆనాటి సాంఘిక అసమానతులపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మామిడికుదురు జనసేన పార్టీ తరపున ఘనంగా నిర్వహించారు. మండల ఆధ్యక్షులు జె.ఎస్.ఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, పెదపట్నం సర్పంచ్ గుబ్బల పండు, ఎంపీటీసీ కడలి భానుజి, సీనియర్ నాయకులు తుండురి బుజ్జి, పోతు కాశీ, కంకిపాటి నరసింహారావు, గ్రామ శాఖ అధ్యక్షులు తెలగారెడ్డి యేసు, బల్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి మద్దింశెట్టి బుజ్జి, మంద గాంధీ, బత్తుల శేఖర్, కార్యదర్శులు మేడేపల్లి సత్తిబాబు, కాట్రెనిపాడు నాగేంద్ర, అడబాల చిన్ని, నాయకులు మట్ట సత్తిబాబు ఈతకోట రమణ, కటకంశెట్టి కృష్ణ తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.