*రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం, ప్రజల అభీష్టం మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి వచ్చే నాలుగేళ్లపాటు కొనసాగుతుందని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం 19వ వార్డులో రూ53 లక్షలతో సిసి రోడ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు, మరియు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భవన కార్మికుల చైర్మన్ వలవల మల్లికార్జున రావు (బాబ్జి) భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ ఈతకోట భీమశంకరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకు నేడు రూ 53 లక్షల రూపాయలతో 19 వ వార్డు నందు శంకర్ భవాని వీధి, మందుల సూర్యరావు వీధి లలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేస్తామన్నారు. పురపాలక సంఘం నిధుల దుర్వినియోగంలో సి ఎఫ్ ఎం ఎస్ ద్వారా వైసిపి నాయకులు అవినీతికి పాల్పడ్డారని అటువంటివారు నేడు వారి సైకో పాలనను మరోసారి మైకుల ద్వారా చెప్పుకుని రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ పాలనలో అవినీతికి పాల్పడిన సి ఎఫ్ ఎం ఎస్ నిధులను రద్దుచేసి నిధి పోర్టల్ ద్వారా పురపాలక సంఘంలో వచ్చిన ఆదాయాన్ని నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను వినియోగించుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గడిచిన ఏడాది కూటమిపాలనలో పురపాలక సంఘం నిధులతో నియోజకవర్గంలో పూర్తిస్థాయి అభివృద్ధి జరిగిందని తెలిపారు. రూ 60 కోట్లతో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం, నాలుగేళ్లలో సిసి రోడ్ల నిర్మాణం, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయిని అందించే కార్యక్రమాలను పూర్తి చేయనున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వర్తనపల్లి కాశి, సబ్జా సుబ్బు, పుల్లా బాబి, అడబాల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, చాపల పప్పుల త్రినాధ్, మట్టి బాబ్జి,రమేష్, మైలవరపు రాజేంద్రప్రసాద్, నీలిపాల దినేష్, పైబోయిన వెంకటరామయ్య, యంట్రపాటి రాజు గుండుమోగుల సురేష్, మద్దాల మణికుమార్, అడబాల మురళి, మలపాక చిట్టి, నల్లగంచి రాంబాబు, గట్టెం నాని, గొర్రెల శ్రీధర్, మద్దిపాటి ధర్మేంద్ర, నాని, కోట శ్రీరామ్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, మట్ట రామకృష్ణ, ఎర్రంశెట్టి శ్రీను, ఎర్ర శ్రీను, దంగేటి సత్యనారాయణ, దాట్ల జగన్నాథ రాజు, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment