మత్స్యకారులకు వైస్సార్సీపీ ప్రభుత్వం చెప్పేది ఎక్కువ.. చేసింది తక్కువ: డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం: మత్స్యకారులకు వైస్సార్సీపీ ప్రభుత్వం చెప్పేది ఎక్కువ చేసింది తక్కువ అని జనసేన పిఠాపురం నియోజకవర్గం నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు ప్రమాధభీమా మరణిస్తే 10లక్షలు, గాయాలైతే 5లక్షలు అని ప్రకటనలు ఇచ్చారు తప్ప ఏ ఒక్క మత్స్యకారుడికి ఇవ్వలేదని, అందుకు కొత్తపల్లి మండలం లో మృతి చెందిన ఏ మత్స్యకారుడికి ఇవ్వలేదన్నారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్కళ్యాణ్ గురించి పెళ్లిళ్ల ప్రస్తావన తప్ప, పాలనపై దృష్టి లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు సుబిక్షింగా వుండాలంటే పవన్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటుంన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మత్స్యకార నాయకులు కంబాల దాసుబాబు, జనసేన రాష్ట్ర నాయకులు పల్లేటి బాపన్న దొర, వంకా కొండబాబు, గేదెల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.