చిల్లపల్లి ఆధ్వర్యంలో “నా సేన కోసం… నా వంతు”

మంగళగిరి నియోజకవర్గం ఇంచార్జ్, రాష్ట్ర వీవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం… నా వంతు” కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు ఎస్.కె.జిలాని పాల్గొనడం జరిగింది. అనంతరం నూతనంగా ఏర్పడిన మండల కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు చిల్లపల్లి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… ఈరోజు మా చిల్లపల్లి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరగటం చాలా సంతోషకరమని తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం..నా వంతు” కార్యక్రమం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మండల, గ్రామ అధ్యక్షులదే ముఖ్య పాత్ర అని తెలిపారు. మన పార్టీ అధ్యక్షులు వారు ఏ కార్యక్రమం తలపెట్టిన మనమందరం కలిసి ఆ కార్యక్రమాన్ని జనాల్లోకి చొచ్చుకుపోయే విధంగా తీసుకువెళ్లే బాధ్యత మనందరిదీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని, రాష్ట్రంలోనే మన జిల్లా ఒక ప్రత్యేకత స్థానం, ముందు వరుసలో ఉంచాలి అని ఆశించారు. చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత పిలుపు మేరకు అధిక సంఖ్యలో ‘నా సేన కోసం నా వంతు ‘ కార్యక్రమాన్ని విజయవంత చేయాలని, అందరూ భాగస్వామ్యులు కావాలని తెలిపార్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్రాణం మార్కండేయ బాబు, విజయ్ శేఖర్, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, ఇస్మాయిల్ బేగ్, నారదాసు రామచంద్ర ప్రసాద్, ఉప్పు రతయ్యా, కోమలి, చవాకుల కొటేష్ బాబు, నియోజకవర్గ, సిటీ, మండల, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.