రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం – నా ఓటు జనసేనకే పోస్టర్ ఆవిష్కరణ

  • యువతలో చైతన్యం నింపేలా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యక్రమాలు
  • ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనది
  • పవన్ కల్యాణ్ లాంటి నేతలకు అండగా నిలవాలని యువతను కోరిన గుంటూరు నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు అనేది అత్యంత శక్తివంతమైనదని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం యువత చైతన్యవంతులై పవన్ కల్యాణ్ లాంటి నాయకుడికి అండగా నిలవాల్సిన చారిత్రక అవసరం ఉందని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. శనివారం స్థానిక 22వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసరావుతోటలో డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో జనసేనకే నా తొలి ఓటు పోస్టర్లను యువత, విద్యార్థుల చేతుల మీదుగా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ నీతివంతమైన పాలన కోసం, కులమత భేదాల్లేని సమసమాజ స్థాపన కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడే పాలనా యంత్రాంగం కోసం, ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడే నేతల కోసం, చట్టసభల్లోకి స్వచ్ఛమైన పాలకులను పంపేందుకు, మా భవిష్యత్ ను బంగారుమయం చేసుకునేందుకు మా తొలి ఓటు జనసేనకే వేస్తామన్నారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, అప్రకటితంగా సాగుతున్న వైసీపీ ఆరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే యువ చైతన్యమే ఆయుధమని అన్నారు. సుమారు నాలుగు లక్షలమంది యువ ఓటర్లు కొత్తగా ఓటు హక్కు పొందారని వారంతా రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని జనసేనకు తమ తొలి ఓటు వేయాలని కోరారు. విద్యార్థులు, యువత మరింత బాధ్యతతో ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యం కావాలన్నారు. తమ తొలి ఓటును జనసేనకు వేయటమే కాకుండా తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు కూడా జనసేనకు బలంగా నిలవబడేలా చూడాలని యువతను నేరేళ్ళ సురేష్ కోరారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ ఎంతో ఉన్నతమైన సిద్దాంతాలు, అత్యున్నతస్థాయి ఆశయాలతో ముందుకు సాగుతూ తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో నడిచేందుకు నేటి యువత తమంతా తాము ముందుకు రావడం శుభపరిణామమన్నారు. అవినీతి, అరాచకాలతో అంటకాగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు అహరహం కృషి చేస్తున్న పవన్ కల్యాణ్ కు ప్రజలు ఏకపక్షంగా మద్దతు తెలపాలని ఆళ్ళ హరి కోరారు. కార్యక్రమంలో పలు కాలేజీల విద్యార్థినీ, విద్యార్థులు, యువకులు, రాష్ట్ర రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్ కుమార్, పార్టీ నాయకులు బండారు రవీంద్ర, గిడుతూరి సత్యం, కోలా అంజి, రామిశెట్టి శ్రీను, పసుపులేటి నరసింహారావు, నండూరి స్వామి, అలా కాసులు, శెట్టి శ్రీను, వడ్డె సుబ్బారావు, హేమంత్, చిరంజీవి, శ్రీను, తిరుపతిరావు, జక్కా రమేష్, షూటర్ రేవంత్, మహర్షి, సమీర్, అఖిల్, రాజా, వంశీ వహీద్ తదితరులు పాల్గొన్నారు.