సాలూరు, ప్రజలు దాహం తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ తెలిపారు. బుధవారం సాలూరు పట్టణం బోసుబొమ్మ జంక్షన్ వద్ద మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పట్టణ మరియు గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.అప్పలనాయుడు, రామకృష్ణ, పట్టణ టిడిపి అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు పాల్గొని రిబ్బన్ కట్ చేసి వారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ చలివేంద్రాలు ఈ వేసవిలో ఎంతో అవసరమని చుట్టుపక్కల గ్రామీణ ప్రజలు, పట్టణ ప్రజలు వస్తుంటారని, అందులో ముసలి వాళ్లు, కాలేజీ, స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అలాంటి వారి కోసం దాహం తీర్చడం కోసం ఇలా ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామాన్ని కొనియాడారు. మీకై..మేము వెల్ఫేర్ అధ్యక్షులు దిలీప్ మాట్లాడుతూ మా సంస్థ ద్వారా ఇలాంటి కార్యాక్రమాలు మా తోటి మిత్రులు, దాతల సహాయ, సహకారాలతో ప్రతి సంవత్సరం సాలూరు పట్టణం బోసు బోమ్మ జంక్షన్ వద్ద మజ్జిగ పంపిణీ, చలివేంద్ర కేంద్రాలను నిర్వహిస్తున్నాము. అలాగే ఈ చలివేంద్రం 100 రోజులు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సభ్యులు గౌడ్ ఈశ్వరరావు, మరిపి రవి, వసంత కుమార్, జె.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment