బద్వేల్ లో ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం

బద్వేల్, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా, మార్చి 14న పిఠాపురంలో నిర్వహించనున్న “ఛలో పిఠాపురం” కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ప్రత్యేక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కో-ఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ హాజరై, “ఛలో పిఠాపురం” పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ, “పిఠాపురం సభ జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక ఘట్టమని తెలిపారు, మరియు బద్వేల్ నియోజకవర్గ స్థానిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కడప జిల్లాలోని ప్రతి జనసైనికుడు, కార్యకర్త, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని” సమావేశం ద్వారా, పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన మార్గదర్శకత్వం అందించి, “ఛలో పిఠాపురం” అనే నినాదంతో బద్వేల్ నియోజకవర్గ నుంచి ఆవిర్భావ సభకు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సభ అతిథిగా రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమనికి ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ పత్తి విశ్వనాథ్, కడప నగర అధ్యక్షులు బోరెడ్డి నాగేంద్ర, బద్వేల్ నియోజకవర్గ పీఓసి బసవి రమేష్, తుడిమెళ్ళ మురళీ, పండ్రా రంజిత్, అజయ్ వర్మ, ఆలీ మరియు బద్వేల్ నియోజకవర్గ జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share this content:

Post Comment