ఎఫ్ ఆర్టీ ఐ జాతీయ కమిటీ మరియు జాతీయ ప్రెసిడెంట్ పి.చంద్ర మోహన్ సూచనల మేరకు జాతీయ సంయుక్త కార్యదర్శి కె.అజయ్ ప్రసన్న కుమార్ నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.రేవతిల సారథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో, జిల్లా బి సి వెల్ఫేర్ ఆఫీసర్ ఏస్.చంద్ర శేఖర్ తో సమావేశమై పాఠశాల, కళాశాలల విద్యార్థులు, బాలికలు రక్షణ, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ అందించే పథకాలు, విద్యార్దులకు మంచి హాస్టల్ సదుపాయాలు, అన్ని హాస్టల్స్ లో పరిశుభ్రత ఉండేవిధంగానూ పిల్లలకు పౌష్టికాహార బోజనము అందేలా చూడాలని, మీ ఆధ్వర్యంలో గతంలో కంటే ఇంకా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ట్ వివిధ శాఖల ద్వారా చిన్నప్పటి నుంచే బాల, బాలికలలో మంచి అభిరుచులును, మంచి ప్రవర్తన, ఆట, పాటలును ప్రోత్సహిస్తూ మంచి విలువలతో కూడిన విద్యను వారికి అందించాలని ఎఫ్ ర్ టీ ఐ నేషనల్ జాయింట్ సెక్రెటరీ అజయ్ ప్రసన్న కుమార్ వారిని కోరారు. దానికి జిల్లా బి సి వెల్ఫేర్ ఆఫీసర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. మీరు సూచించిన పై విషయాలు అన్నిటి మీద తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్ ర్ టీ ఐ, నాయకత్వాలు, కార్యకర్తలు అందరూ ఆర్టీఐ చట్టం ద్వారా అన్ని గవర్నమెంట్ శాఖల అధికారులలో, ప్రజల పట్ల జవాబు దారి తనాన్ని పెంచేలా కృషి చేస్తుందని చంద్ర శేఖర్ గారికి అజయ్ వివరించారు. ఈ సమావేశంలో రాజ్యాంగ చట్టాలతో కూడిన ఫోరమ్ ఫార్ ఆర్టీఐ నూతన పుస్తక ప్రచురణను, నూతన కాలెండర్ ను చర్ ఫోరమ్ ఫార్ ఆర్టీఐ జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు ఆఫీసర్ గారికి అందచేయటం జరిగింది. కార్యక్రమంలో ఎఫ్ ర్ టీ ఐ జిల్లా అధికార ప్రతినిధి డి.కరాటే చంద్ర శేఖర్, జిల్లా జనరల్ సెక్రటరీ బి.వెంకట్,జిల్లా ప్రెసిడెంట్ ప్రశాంత్, జిల్లా మహిళా ప్రెసిడెంట్ జీ.సూర్య కుమారి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రాయ్, జిల్లా జాయింట్ సెక్రటరి కె.అనిల్ కుమార్, తిరుపతి మహిళా నాయకులు సుజాత, తిరుపతి పట్టణ సెక్రటరీలు వేణు గోపాల్, శివ, తిరుపతి పట్టణ నాయకత్వాలు షోభావతి, రాణి, ప్రవీణ్, నగరి, పుత్తూరు నియోజకవర్గo అధ్యక్షులు జయలక్ష్మి, గోపి పాల్గొన్నారు.
Share this content:
Post Comment