కాలువ పూడికతీత పనులకు శంకుస్థాపన

*రైతులకు నిఖార్సైన అండగా బొమ్మిడి నాయకర్

నరసాపురం, రైతుల సాగునీటి అవసరాలపై ప్రాధాన్యత చూపుతున్న కూటమి ప్రభుత్వం, నరసాపురం నియోజకవర్గంలోని సీతారామపురం నుండి ఎల్బీ చర్ల వరకు ఉన్న రామన్నపాలెం ప్రధాన కాలువలో పూడికతీత (ఎర్త్ వర్క్) పనులను ప్రారంభించింది. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 7.6 లక్షల వ్యయంతో సుమారు 5 కిలోమీటర్ల మేర చేపడుతున్న ఈ పనుల ద్వారా పైభాగాల నుంచి దిగువ ప్రాంతాల వరకూ సాగునీరు సమర్ధవంతంగా ప్రవహించేలా చూడడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రత్యేకంగా ఎల్బీచర్ల వద్ద మూడున్నర కిలోమీటర్ల వరకూ చిన్న కాలువల ద్వారా నీరు పంపిణీ చేయడం వల్ల వరి పంట సాగు చేయగలుగుతారని ఆయన వివరించారు. “రైతుల జీవన ప్రమాణం మెరుగుపడాలంటే సాగునీటి నిరంతర సరఫరా అనివార్యం. అందుకోసమే మేము ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం,” అని బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డెల్టా వైస్ చైర్మన్ గుబ్బల మారాజు, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, వట్టిప్రోలు సతీష్, పులి భుజంగరావు, ఇంటి మురళి లతోపాటు జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment