అభివృద్ధి లక్ష్యంగా ఏలూరులో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు

ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రజాసంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అవసరమైన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఏలూరు 4, 5 డివిజన్‌ల పరిధిలోని నాగేంద్రకాలనీ ఐబిఎమ్ చర్చి నుండి ఆంజనేయస్వామి గుడి వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి 15వ ఆర్ధిక సంఘం నిధుల కింద ₹29 లక్షలతో ప్రారంభించిన పనులకు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, నిధుల కొరత ఉన్నప్పటికీ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నిటిని దశలవారీగా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, చిన్న వర్షాలకే ముంపుకు గురయ్యే ఏలూరు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం ప్రజలకు పెద్ద మేలు చేస్తుందని పేర్కొన్నారు. స్థానిక ప్రజల సమస్యలను ఎమ్మెల్యే చంటి వెంటనే పరిష్కరించడం అభినందనీయమని తెలిపారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ, రహదారుల అభివృద్ధికి ఎమ్మెల్యే చంటి నేతృత్వంలో దృఢమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, డిప్యూటి మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, ఇతర నాయకులు, మరియు టిడిపి ప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-17-at-12.17.49-PM-1024x576 అభివృద్ధి లక్ష్యంగా ఏలూరులో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు

Share this content:

Post Comment