*కొణిదెల గ్రామానికి ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌కు భూమిపూజ
నందికొట్కూరు, 2018 ఎన్నికల ప్రచారంలో నందికొట్కూరు నియోజకవర్గంలోని కొణిదెల గ్రామానికి పర్యటించిన జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, “ఈ గ్రామానికి ఏదైనా చేస్తా” అని ఇచ్చిన మాటకు నిలబడుతూ, గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో 90 వేల లీటర్ల సామర్థ్యం గల త్రాగునీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్, కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, ఎం.పి బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయకుమార్, జిల్లా కలెక్టర్, అధికారులు, జనసేన మరియు ఎన్.డి.ఏ కూటమి నేతలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజలతో నిబంధితమైన అభివృద్ధి మాటకు కట్టుబడి నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఈ చర్య ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది.

Share this content:
Post Comment