*రుస్తుంబాదలో బొమ్మిడి నాయకర్
నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామంలో రూ. 30 లక్షల నిధులతో చేపట్టిన రహదారి అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ముందుకెళ్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బందెల భారతి, పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది, వార్డ్ మెంబర్లు సహా యడ్లపల్లి, మైలబత్తుల, బందెల, వట్టిప్రోలు, కాకుముళ్ల తదితర గ్రామాల నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ఇది కీలకమైన అడుగుగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Share this content:
Post Comment