అంగరంగ వైభవంగా నెల్లిమర్లలో జనసేన కేంద్ర కార్యాలయ శంకుస్థాపన

నెల్లిమర్ల, భోగాపురం జాతీయ రహదారి పక్కన ఆదివారం లోకం ప్రసాద్ నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అనంతరం జగిరిన సభలో అయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా నెలకు రూపాయలు 5 వేలు ఇచ్చి వారితో సంఘ సేవచేయిస్తున్నారని, అలాగే ఉచిత పథకాలు ఇస్తున్నామని చెప్పి అధిక ధరలతో మళ్ళి ప్రజలనుండి ఇచ్చిన పథకాలు కన్నా ఎక్కువ పిండేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు కందివలస గెడ్డలో ప్రవహిస్తున్న కెమికల్ కంపినీల వ్యర్థాలు కనించలేదా? అలాగే పూసపాటిరేగ మండలంలో చాల గ్రామాల్లో భూగర్భ జలాలు కెమికల్ కంపెనీలు వల్ల కలుషితమయ్యాయని వాటి గురించి పట్టించుకోరా? నాలుగు సంవత్సరాలు క్రితం చంద్రబాబు శంకుస్థాపన చేస్తే ఇప్పటివరకు విమానాశ్రYఅ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ జిల్లా నుంచే విద్యార్థులు ఎంసెట్ పరీక్ష వ్రాయడానికి విజయవాడ వెళ్లాల్సిరావడం బాధాకరమన్నారు. ఇలా చెప్పుకొంటూపోతే వేల సమస్యలున్నాయని మరి మనం వైఎస్ జగన్ ఎందుకు నమ్మాలన్నారు. ఆర్థికంగా చితికిపోయిన వేల మంది కౌలు రైతులకు 5 లక్షలు చొప్పున సహాయం అందించడమే కాకుండా తాను సంపాదించిన ప్రతీ పైసా పవన్ కళ్యాణ్ పేదలకు వెచ్చిస్తున్నారన్నారు. జనసేన అధికారంలోకి వచ్చేందుకు వచ్చే ఎన్నికల్లో అందరం గాజుగ్లాస్ కు ఓటేసి మంచి మనసున్నపవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. రాష్ట్రంలో వైకాపా పాలన అవినీతి పాలనగా మారిందని అన్నారు. ఆ నాయకులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎప్పుడో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన విమానాశ్రయానికి మళ్లీ జగన్ మోహనరెడ్డి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడే విమానాలు ఎగిరినట్లు గాబరాగాబరాగా అక్కడ గ్రామాలను ఖాళీ చేయించారని అన్నారు. ఇళ్లు నిర్మాణం పూర్తికాలేదు కొంత సమయం ఇవ్వండని కోరినప్పటికి కనీసం పట్టించుకోలేదని అన్నారు. అంతేకాక ఆయన శంకుస్థాపనకు వచ్చినరోజే పూసపాటిరేగ మండలం కందివలస వద్ద గెడ్డ ఆక్రమించుకొని రహదారిని నిర్మాణం చేసిన ఫార్మా కంపెనీపై కనీస చర్యలు లేవన్నారు. అలాగే అల్లాడపాలెం గ్రామ పరిసరాల్లో నీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు తాగితే అక్కడ పరిస్థితి ఏంటో అర్ధమవుతుందని అన్నారు. ఎందుకంటే నీరంతా ఫార్మా కంపెనీల వ్యర్థాలతో తాగలేని స్థితితో ఉన్నాయన్నారు. అలాగే సంక్షేమ పథకాలు ఆ పార్టీ నాయకులకు తప్ప పేదలకు అందే పరిస్థితి రాష్ట్రంలో నేడు లేదని అన్నారు. అంతేకాక ఎవరైనా వారికి వ్యతిరేకంగా కాని పథకాలు అందలేదని అంటే వారిని ఇబ్బందులకు గురిచేయడం చాలా దారుణమని అన్నారు. అనంతరం శంకుస్థాపనకు హాజరైన సుమారు 2000 మంది మహిళలకు చీరలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజు. చక్రవర్తి, రవితేజ, ఖాన్ భోగాపురం మండల అధ్యక్షులు వందనాల రమణ, నియోజకవర్గ సీనియర్ నాయకులు పల్ల రాంబాబు, పల్లంట్ల జగదీష్ జోగారావు, పైల శంకర్, గోవిందు, సతీష్, రాంచంద్ర, వీర మహిళలు అట్టాడ ప్రమీల బాసి దుర్గ, హైమ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.