రూ.1650 కోట్ల సెంట్రల్ డెల్టా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా, రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ కాట్రేనిపాడు గ్రామంలో శనివారం కొత్త వాటర్ ట్యాంక్‌కు శంకుస్థాపన చేశారు. బొబ్బర్లంక వాటర్ గ్రిడ్ ద్వారా పైపులైన్ ద్వారా మంచినీటి సరఫరా జరగనున్నదని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 60 వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మెగా సంస్థ ప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment