వైసీపీ చేసిన మోసం హౌసింగ్ స్కీం, జగనన్న స్కాం

రాజంపేట నియోజకవర్గంలో సిద్ధవటం మండలం మాధవరం పంచాయతీలో జగనన్న కాలనీ సందర్శించిన జనసెన నాయకులు. కనీస రోడ్డు వసతి లేని చోట కొండ ప్రాంతం లో ఇది వరకు సోమశిల ప్రాజెక్ట్ వల్ల సర్వం కోల్పోయిన వారికి ఇచ్చిన డీకేటీ భూములను లాక్కొని ఇచ్చారు అని అది కూడా ఎవరికైనా చెప్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు అని మామిల్ల వెంకట సుబ్బయ్య జనసేన నాయకులతో వాపోయారు. రోడ్డు లేదు, సరైన వసతులు ఏవి లేక పోగా నాసిరకం పనులతో కొన్ని చోట్ల గోడలు కట్టారు, ఎవరి ఇల్లు వారే కట్టుకుంటే ప్రభుత్వం డబ్బు తిరిగి ఇస్తుందని చెప్పి ఇంకా బిల్లులు చెల్లించలేదు అని, ఇది వరకే ఇల్లు ఉన్నా మళ్లీ వారికి ఇల్లులు ఇచ్చారు అని ఇలా అనేక రకాలుగా ఇస్టారీతిగా ప్రభుత్వం వహించటం వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం అని జనసేన నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సంక్షేమం పేరిట సంక్షోభం లోకి తీసుకెళ్ళి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు, హౌసింగ్ స్కీం కాదు జగనన్న స్కాం అని జనసెన్ రాజంపేట నాయకులు బాలసాయి కృష మీడియా వారి సమక్షంలో వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన వసతులు కల్పించి త్వరగా ఇళ్లను పూర్తి చెయ్యాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురవుతారు అని జనసెన నాయకులు ఎం వెంకటేశ్వరరావు తెలియచేశారు. రాజంపేట జనసెన పార్టీ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సిద్ధవటం మండల అధ్యక్షుడు కొట్టే రాజేష్, జిల్లా లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కత్తి సుబ్బరాయుడు, భాస్కర్ పంతులు, వీరయ్య ఆచారి, జనసేన వీర మహిళ జడ్డా శిరీష మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.