ఉచిత క్యాన్సర్ అవగాహన క్యాంప్ ను ప్రారంభించిన నిమ్మక జయక్రిష్ణ

పాలకొండ నియోజక వర్గం, వీరఘట్టం మండలం, వీరఘట్టం పట్టణంలో గల పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో ఒమేగా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఉచిత క్యాన్సర్ అవగాహన మరియు క్యాన్సర్ నిర్ధారణ క్యాంప్ లో పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ పాల్గొని రిబ్బన్ కట్ చేసారు. ఒమెగా హాస్పిటల్స్, భారతదేశంలో 10+5 కేంద్రాలలో, ప్రైవేట్ ఆంకాలజీ నెట్ వర్కెలో 2వ అతి పెద్ద సమూహంగా సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో భాగంగా ఉమెన్ క్యాన్సర్ కేర్ (“ఉమెన్ క్యాన్సర్ కేర్”) లక్ష్యంగా, ఆంధ్రప్రదేశ్ అంతటా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు మరియు అవగాహనతో మీ ముందుకు వచ్చింది. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని ఎం.ఎల్.ఏ నిమ్మక జయకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స.పుండరీకం, జనసేన పార్టీ టౌన్ అధ్యక్షుడు సరిపల్లి అచ్చుత రావు, ఉపాధ్యక్షుడు ఉదయాన చరణ్, కర్ణేన సాయి పవన్, పండు, ఒమేగా హాస్పిటల్ డాక్టర్లు, మరియు సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment