ఉచిత దంత వైద్య శిబిరం

అమలాపురం, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి హైస్కూల్ నందు ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఒంటెద్దు అమృతవల్లి ఎం.డి.ఎస్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించడం జరిగిందిరు. విచ్చేసిన వారికి దంత పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఒంటెద్దు వెంకయ్య నాయుడు, జనసేన నాయకులు మద్దింశెట్టి ప్రసాద్, నాగిరెడ్డి వీర్రాజు, అరిగెల నానాజీ, సలాది పట్టాభి, సలాది శివాజీ, సలాది శ్రీనివాస్, పోలిశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.