శ్రీకృష్ణదేవరాయ కాపు సేవా సంఘం పిడుగురాళ్ల ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి పంపిణీ

గురజాల, దేవరంపాడు నేతి వెంకన్న కొండ నందు మూడవ శనివారం తిరునాళ్ళ సందర్భంగా పిడుగురాళ్ల శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ఫిల్టర్ వాటర్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ… గత 14 సంవత్సరాలు నిర్విర్వామంగా ప్రతి మూడు, నాలుగు, శనివారాలు తిరునాళ్లకు వచ్చేటువంటి భక్తులకి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత వాటర్ మరియు 4వ వారం మజ్జిగ పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ పాల్గొని భక్తులకు మంచినీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గుర్రం రామకోటేశ్వరరావు, పిడుగురాళ్ల పట్టణ టూవీలర్ అసోసియేషన్ అధ్యక్షులు తిప్పనబోయిన వెంకట్రావ్, బేతంచర్ల కొండా మేస్త్రి, రోళ్ళ శ్రీనివాసరావు, కూరాకుల నరసింహారావు, బత్తుల కేశవ్, బేతంచర్ల ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు.

Share this content:

Post Comment