రాజంపేట, చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్తు నిర్ణయం ఎంతో హర్షణీయమని జనసేన రాష్ట్ర చేనేత విభాగ వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం చేనేత కార్మికులకు ఎంతో ఉపయుక్తంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ, చేనేత పరిశ్రమ అనేది ఎక్కువగా చిన్న, మధ్య తరహా కుటుంబాల ఆధారంగా నడిచే రంగమని తెలిపారు. ఈ రంగంలో విద్యుత్తు వ్యయం ప్రధాన ఖర్చుగా ఉంటుందని, ఉచిత విద్యుత్తు అందించడంపై చేనేత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి అని పేర్కొన్నారు. విద్యుత్తు వ్యయం తగ్గడంతో కార్మికులకు ఆర్థిక భారం తగ్గి, వారు మరింత ఉత్పాదకంగా పని చేయగలుగుతారు. ఉత్పత్తి వ్యయం తగ్గడం ద్వారా కొత్తగా యువత ఈ రంగంలోకి ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఉత్పత్తి ఖర్చులు తగ్గితే వినియోగదారులకు కూడా మెరుగైన ధరలకు వస్త్రాలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు.
Share this content:
Post Comment