పుష్పగిరి హాస్పిటల్ సహకారంతో జనసేన ఉచిత కంటి వైద్య శిబిరం

గోపాలపట్నం 89వ వార్డు ఎల్లపువాని పాలెం, గతవారం 22వ తారీకు శనివారం నాటి నుండి నేటి వరకు 89వ వార్డు ఎల్లపువాని పాలెం గ్రామంలో కాపు వీధి రామాలయం దగ్గర జనసైనికుల ఆధ్వర్యంలో విజయనగరంలో పుష్పగిరి హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆ వైద్య శిబిరంలో చెక్ అప్ చేయించుకున్న వారిలో 29 మందికి ఆపరేషన్ చేపట్టాలని సింహగిరి హాస్పిటల్ డాక్టర్ లోవరాజు పిలుపునివ్వగా వారిలో 89వ వార్డు నుంచి 12 మందిని ఆపరేషన్ కి ఈ వార్డు నుంచి పంపించడం జరిగింది. అదేవిధంగా వారిని పంపించి ఆపరేషన్ అయిన నిమిత్తం మరలా వారిని జాగ్రత్తగా ఇంటికి చేర్చి బాధ్యత తీసుకుంటున్నామని వెల్లడించారు. 89 వ వార్డు జనసైనికులు జోగా అప్పలరాజు, అవినాష్, కృష్ణ, గణేష్, సురేష్, శంకర్, హేమంత్, ప్రశాంత్ మరియు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.