జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

చిలకలూరిపేట నియోజకవర్గం: చిలకలూరిపేట మండలం, కట్టుబడివారి పాలెం గ్రామంలో చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన నాయకుడు పెంటేల బాలాజీ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కంటి సమస్యలు ఉన్న 104 మంది గ్రామ ప్రజలు పాల్గొని వైధ్య సేవలు వినియోగించుకోవటం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వారికి మెడిసిన్స్ కంటి చుక్కల మందు ఉచితంగా ఇవ్వటం జరిగింది. 40 మందికి కళ్ళజోడులు, 15 మందికి చుక్కడాలు ఉచితంగా చేపిస్తున్నామని పెంటేల బాలాజీ తెలియచేసారు. దీనిలో భాగంగా ఆ గ్రామ ప్రజలు కట్టుబడివారిపాలెం గ్రామంలో ఇలా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికీ సహాయం చేసినందుకు సంతోషం వ్యక్త పరిచి జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో వందలమందికి సహాయం చేస్తునందుకు బాలాజికి అభినందనలు తెలియచేసారు. అలాగే జనసేన పార్టీ అధికారంలోకి రావటం కోసం 2024 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారికి అండ దండలుగా ఉంటామని అని తెలిపారు. ఇలాంటి మంచి సేవలు అందించినందుకు చిలకలూరిపేట మండల నాయకులు తిమ్మిశెట్టి కోటేశ్వరరావు గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ నాయకులు పగడాల వెంకటేశ్వరావు, అచ్చుకోల అరుణ్, ఆముదల లీలా కిషోర్, ముద్ద యోబు, నాదెండ్ల మండల అధ్యక్షులు కొసన పిచ్చయ్య, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మల్ల కోటి, యడ్లపాడు మండల కార్యదర్శి బొందులపాటి సుబ్బారావు, పేట మండల నాయకులు తోటకూర అనిల్ కుమార్, చామకూరి సాంబ పాల్గొన్నారు.