ఉచిత కంటి పొర చికిత్స శిబిరం

మంగళగిరి పట్టణంలోని దామర నాంచారమ్మ ప్రాంగణంలో ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఏపిఎంఎస్ఐడిసి ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు కలిసి ప్రారంభించారు. చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు చిల్లపల్లి నాగ తిరుమలరావు ఆధ్వర్యంలో, శంకర నేత్రాలయ మరియు పుట్టపర్తి ఎంఈఎస్యు సంయుక్తంగా ఈ శిబిరాన్ని వారం రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, “అమెరికాలో ఉన్నప్పటికీ తమ తండ్రి చిల్లపల్లి అమరయ్య గారి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన తండ్రిపట్ల తిరుమలరావు గౌరవం మరియు పేదల పట్ల సేవా దృక్పథం ప్రశంసనీయం” అన్నారు. ఈ శిబిరం ద్వారా పేదలకు ఉచితంగా మెరుగైన కంటి చికిత్స అందించడమే లక్ష్యమని తెలిపారు.

WhatsApp-Image-2025-06-21-at-6.47.40-PM-1024x557 ఉచిత కంటి పొర చికిత్స శిబిరం

Share this content:

Post Comment