ఏటుకూరులో ఉచిత వైద్య శిబిరం

ప్రత్తిపాడు నియోజకవర్గం: కోస్టల్ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో తన్నీరు లక్ష్మణ్ వారి మిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఉచిత షుగర్ పరీక్షలు, బి.పి, కంటి, మరియు డెంటల్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసినారు. ఈ వైద్యశిబిరం లో డాక్టర్ యస్. శివప్రసాద్ ఎం.డి. జనరల్, డాక్టర్ సాయిక్రిష్ణ ఎం.డి. జనరల్, డాక్టర్ కోటేశ్వరరావు క్రిటికల్ కేర్, డాక్టర్ దివ్య స్తీ వైద్య నిపుణులు డాక్టర్ హరీష్ చౌదరి డెంటల్, డాక్టర్ రజిత నిపుణులు, డాక్టర్ అనిల్ కంటి వైద్య నిపుణులు పాల్గొన్నారు. కోస్టల్ కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కె. మురళి పర్యవేక్షణలో జరిగినది. సుమారుగా 500 మంది మహిళలు, వృద్దులు, పురుషులు, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. రోగులకు ఉచితంగా మందులు, కళ్ళజోడ్లు పంపిణీ చేశారు. పేద ప్రజలు ఈ సదావకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. తదనంతరం కోస్టల్ కేర్ హాస్పిటల్ యం.డి. శివప్రసాద్ ను జనసేన పార్టి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య మరియు లక్ష్మణ్ మిత్రబృందం సంయుక్తంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వారికి వెంకట రత్తయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వైద్యశిబిరంలో డాక్టర్ల బృందానికి కావలసిన అన్ని ఏర్పాట్లును చక్కగా చేసిన లక్ష్మణ్ బృందానికి శివప్రసాద్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిశ్శంకరరావు బాబి, నిశ్శంకరరావు వాసు, రాజశేఖర్, అప్పారావు, రామక్రిష్ణ, నల్లక నవీన్, బాలు, నల్లక శివ తదితరులు పాల్గొన్నారు.