తొత్తరమూడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం..!

పి.గన్నవరం, అయినవిల్లి మండలం, తొత్తరమూడి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తొత్తరమూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు, నిపుణులైన వైద్యుల సహాయంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆవశ్యక మందుల పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలను మరింతగా ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు.

Share this content:

Post Comment