విరవాడ గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

పిఠాపురం నియోజకవర్గం విరవాడ గ్రామంలో జనసేన నాయకుల, జనసైనికుల అభ్యర్థన మేరకు ఇటీవల కాలంలో జనసేన పార్టీలో చేరిన విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం నందు జనరల్ మెడిసిన్ అయిన బీపీ, సుగర్, వైరల్ ప్లివర్, ఆర్థో మెడికల్ విభాగంలో ఎముకల, కీళ్ల నొప్పులకు చిల్డ్రన్ సమస్యలకు
గైనిక్ విభాగంలో స్త్రీ ప్రసూతి మరియు సమస్యలకు స్పెషలిస్ట్ లచే ప్రత్యేక విభాగాలతో సుమారు వెయ్యి మంది ప్రజానీకానికి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ మారుతున్న జీవన సరళిలో సగటు పౌరుడికి నేటి పరిస్థితులలో వైద్యం నిత్య అవసరం అవుతుంది అని, ఆర్థిక పరిస్థితుల లేమితో ఉత్తమ వైద్యానికి దూరమౌతున్న గ్రామీణ ప్రజానీకానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో తమ శక్తిమేర పిఠాపురం నియోజక వర్గంలో వైద్య సేవలు ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉభయ గోదావరి జిల్లాల జనసేన మహిళా కొహార్దినేటర్ చల్లా లక్షి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల జనసేన అధికార ప్రతినిధి తోలేటి శిరీష, నియోజకవర్గ జనసేన నాయకులు వెన్నా జగదీష్, తెలగం శెట్టి వెంకటేశ్వరరావు మరియు కందరాడ జనసేన ఎంపిటిసి పిల్లా సునీత, జనసేన వీరమహిళ పిల్లా రమ్యజ్యోతి, పిఠాపురం రూరల్ మరియు టౌన్ జనసేన పార్టీ నాయకులు బాలిపల్లి అనిల్, పల్నాటి మధు, బుర్ర సూర్యప్రకాష్ రావు, వేల్పుల చక్రధరరావు, రూరల్ నుండి పిల్లా వెంకట దినేష్, బొజ్జ శ్రీను, రాసంశెట్టి సూరిబాబు, వాకపల్లి సూర్య ప్రకాష్, అడపా శివరామకృష్ణ, గంజి గోవిందరాజు, విరవ సత్యనారాయణ, విరవాడ గ్రామం నుండి అధిక సంఖ్యలో జనసేన పార్టీకి చెందిన నాయకులు జనసేన పాల్గొన్నారు. ఈ ఉచిత మెగా క్యాంపు ఈవెంట్ ను ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన విరవాడ జనసైనికులకు ప్రత్యేక ధన్యవాదములు. ఈ మెగా క్యాంప్ సక్షస్ కు అమితమైన సేవలందించిన మెడికల్ రిప్రజెంటేటీవ్స్, సహాయ సహకారాలు అందించిన ఆర్థోపెడిక్ డా మొగిలి కాశి విశ్వనాథం, డా ఉషశ్రీ, డా అనుష్ కుమార్, డా రాజీవ్, డా కె సుబ్రమణ్యం, డా కె స్వామి లకు పిల్లా శ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.