పెంటేల బాలాజి అధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

చిలకలూరిపేట నియోజకవర్గం: నాదెండ్ల మండలం, జంగాలపల్లి గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పెంటేల బాలాజి 9వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పెంటేల బాలాజి క్యాంపు ప్రారంభం చేశారు. 145 మంది గ్రామస్తులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలియచేసారు. వీరిలో 18మందికి ఉచితంగా చుక్కడాలు తీపిస్తున్నామని అలానే 124 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళు అందిస్తున్నామని తెలియచేసారు. గ్రామస్తులు బాలాజికి ఘన స్వాగతం పలికి వేణుగోపాల స్వామి గుడిలో మేరిమాత మందిరంలో, బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన పార్టీ తెలుగుదేశం, బిజెపి కలిసి అధికారంలోకి రావాలని ప్రజలు అభిప్రాయం తెలియచేసారు. బాలాజి మాట్లాడుతూ ప్రజాభిమానం వెలకట్టలేనిదని వారికోసం పవన్ కళ్యాణ్ గారి బాటలోనే మేము కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఇప్పటి వరకు వేలమందికి ఉచితంగా కళ్ళజోళ్ళు అందించామని, వందల మందికి ఉచితంగా చుక్కడాలు తీయించగలిగామని, రాబోయే కాలంలో నియోజకవర్గం అంతటా ఇవే కార్యక్రమాలు నిర్వహించి ఆరోగ్య చిలకలూరిపేట నియోజకవర్గంగా మారుస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంనకు సహకరించిన జంగాలపల్లి జనసేన నాయకులు జాన్ సైదా, కిరణ్, మస్తాన్, శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేసారు, ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండల అధ్యక్షులు కొసన పిచ్చయ్య, జి డి నాయుడు, అల్లం రాజా, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మల్లా కోటి, కార్యదర్శులు పాపన హనుమంతరావు, బొందలపాటి సుబ్బారావు, పట్టణ నాయకులు అచ్చుకోల అరుణ్, టీ అనిల్, అరుణ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.