ఉచిత మెగా వైద్య శిబిరము

మైలవరం నియోజవర్గం, కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నంలో జనసేన నాయకులు దేవబత్తుల నాగబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మైలవరం నియోజకవర్గం ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) హాజరయ్యారు. దక్షిణ భారతదేశ కాపు జేఏసీ నాయకులు దాసరి రాము, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జిల్లా కోఆర్డినేటర్ చింతల లక్ష్మి, ఇబ్రహీంపట్నం మండలం పార్టీ ఇన్చార్జి ఎంపీటీసీ పోలిశెట్టి తేజ హాజరయ్యారు.

అదే విధంగా వివిధ గ్రామాల నుంచి జన సైనికులు సామల సుజాత, ఎర్రం శెట్టి నాని, యతిరాజుల ప్రవీణ్ కుమార్, బుద్దాల అశోక్ బాబి, వ్యాకరణ పార్థసారథి, రాగాల నాని, ఎర్రం శెట్టి సాయి చిట్టేల కోటేశ్వరరావు, చిట్టేల హరీష్, కొమ్మూరు వెంకటస్వామి, పగడాల బాల, పవన్, నాగేంద్ర, కుమార్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని భారీగా విజయవంతం చేయడమైనది.

ఈ కార్యక్రమంలో 200 మంది పైగా ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. మరియు వారికి ఉచితంగా బిపి, షుగర్, టుడీ ఏకో, ఈ సి ఓ, ఈసీజీ పరీక్షలు చేయించి వారికి ఉచితంగా మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ వైద్య శిబిరాన్ని, మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయుకులకి, వీర మహిళలకి, అలాగే ప్రతి కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.