*జనసేన జానీ పుట్టినరోజు సందర్భంగా జులై 2, బుధవారం కార్యక్రమ నిర్వహణ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ పుట్టినరోజు (జులై 2, బుధవారం) సందర్భంగా రాగోలు జేమ్స్ హాస్పిటల్ వైద్య నిపుణుల సహకారంతో బొడ్లపాడు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ వైద్య శిబిరం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జరుగుతుంది. శిబిరంలో ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, కంటి వైద్య నిపుణులు ఉచితంగా తనిఖీలు నిర్వహించి, మందులు అందించనున్నారు. అలాగే, అవసరమైతే మరుసటి రోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ల కోసం ప్రత్యేక బస్సు కూడా ఏర్పాటు చేయబడనుంది.బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు వంటి సేవలు కూడా శిబిరంలో ఉచితంగా లభించనున్నాయి. ఈ కార్యక్రమానికి పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎన్డీఏ కూటమి జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. జనసేన జానీ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత వాసులు, నాయకులు, బంధువులు, స్నేహితులు, పోలీస్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. క్యాంపు ఏర్పాట్లను జేమ్స్ హాస్పిటల్ సిబ్బంది, వీరఘట్టం మండల కూటమి నాయకులు మాచర్ల అనిల్ బాబు, లింగాల చంటి, సొంటేన శ్రీనివాస్, జనసేన జానీ కలిసి పరిశీలించారు. ఈ శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రజలందరికీ హృదయపూర్వక ఆహ్వానం
Share this content:
Post Comment