ఇచ్చాపురం జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

ఇచ్చాపురం మండలం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. సోమవారం తిప్పిన దుర్యధన రెడ్డి నాయత్వములో.. జేమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో.. జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చాపురం మండలం, మసకపురం గ్రామంలో.. ఆ గ్రామ జనసైనికుల సహకారంతో ఇచ్చాపురం ఇంచార్జ్ దాసరి రాజు చేతులు మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మసకపురం సర్పంచ్ అభ్యర్థి మాధవరెడ్డి, మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరిబెహరా, వీర మహిళ నీలవేణి రెడ్డి మరియు 9 వ వార్డు ఇంచార్జ్ సంతోష్ మహరణ, దుంగు భాస్కర్ రెడ్డి, బాలరాజు, మాధవరెడ్డి, హేమరాజు రెడ్డి, లాలీన్, హరీష్, సోమేశ్ విచ్చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. గ్రామంలో ప్రజలకు సుమారు రెండు వందల మందికి పైగా మందులు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.