ఇచ్చాపురం జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం

ఇచ్చాపురం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో తిప్పిన దుర్యధన రెడ్డి నాయత్వములో మెడికవర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఇచ్చాపురం మండలం ఆవేలి బలరాంపురం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆవేలి బలరాంపురం గ్రామ జన సైనికులు సహకారంతో ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బైపల్లి ఈశ్వరరావు, మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరిబెహరా, దుంగు భాస్కర్ రెడ్డి, మున్సిపాలిటీ 10 వార్డ్ ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, లోళ్ల రాజేష్, తిప్పన సురేష్, పాపారావు గ్రామ జనసైనికులు ఏ పద్మనాభం, లండ పాపయ్య, పైల శంకర్, ఆసి డిల్లేష్, దుర్గాసి జోగారావు, జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. డాక్టర్లు జయరామ్, రేవతి ప్రజలకు సంబంధిత పరీక్షలు చేశారు. సుమారు 300 మందికి పైగా ఉచితంగా మందులు పంపిణి చేసారు.