ముట్లూరు జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

ప్రత్తిపాడు: ముట్లూరు జనసేన ఆధ్వర్యంలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ సహకారంతో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డా. పాకనాటి, కృష్ణ స్రవంత్, డా. పాకనాటి, అమూల్య, డా. బాలాజీ, ప్రత్తి పాపారావు, వట్టిచెరుకూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రత్తి బావన్నారాయణ, కొర్రపాటి నాగేశ్వరరావు, ముట్లూరు గ్రామ అధ్యక్షుడు కోటికం వెంకటేశ్వరరావు, ప్రత్తి బ్రహ్మయ్య, బీరాల శ్రీనివాసరావు మరియు ముట్లూరు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.