తణుకు జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

తణుకు నియోజకవర్గం: తణుకు మండలం, వేల్పూర్ గ్రామంలో గీతా మందిరంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో రాజా వల్లి రాధా రమణి లైన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షా శిబిరం మరియు దంత వైధ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో అవసరమైన వారికి మందులు మరియు కళ్ళజోళ్ళు విడివాడ రామచంద్ర రావు వారి ఆర్థిక సహాయంతో అందజేసారు. ఈ కార్యక్రమంలో అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాదు, తణుకు మండలం అధ్యక్షులు చిక్కాల వేణు, తణుకు టౌన్ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ఇరగవరం మండలం అధ్యక్షులు ఆకేటి కాశి, పంతం నానాజీ, జవ్వాది ప్రసాదు, మండపాక వైస్ ప్రెసిడెంట్ నగేష్, మండపాక ఎంపీటీసీ శ్రీనివాస్, రెల్లు రాయుడు, కేశవ, వేల్పూర్ గ్రామ జనసైనికులు రమేష్, స్వామి, కృష్ణ, కరుణ, కిషోర్, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.