మరో రెండు రోజులు నెట్‌ ఫ్లిక్స్‌ లో ఫ్రీ ఆఫర్

ఇండియన్ యూజర్ల కోసం నెట్‌ ఫ్లిక్స్ మరో రెండు రోజులు తన స్ట్రీమ్‌ఫెస్ట్‌ ను తీసుకొచ్చింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు నెట్‌ఫ్లిక్స్‌ లో అన్నీ ఫ్రీగా చూసే అవకాశం ఇండియన్ యూజర్లకు కల్పించింది. మొదట డిసెంబర్ 5-6 తేదీల్లో ఈ ఫ్రీ ప్రమోషన్ చేయగా.. ఇప్పుడు మరో రెండు రోజులు పొడిగించింది. అంటే ఈ 48 గంటల పాటు ఇండియన్ యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ లో అన్నీ ఉచితంగా చూడొచ్చు. ఒకే స్క్రీన్‌ పై అది కూడా కేవలం ఎస్‌డీ స్ట్రీమ్‌ కి మాత్రమే నెట్‌ఫ్లిక్స్ అనుమతి ఇచ్చింది. ఇక యూజర్ల సంఖ్యను కూడా పరిమితం చేసింది. ఒకవేళ నెట్‌ఫ్లిక్స్ ఎస్‌డీ స్ట్రీమింగ్ మీకు పని చేయకపోతే.. అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోకుండా పరిమిత స్థాయిలో తన ఒరిజినల్ మూవీస్‌, టీవీ సిరీస్ చూసే అవకాశం కూడా కల్పిస్తోంది. వీటిని హెచ్‌డీలో చూసే అవకాశం ఉన్నా.. కేవలం ఆండ్రాయిడ్‌, విండోస్ పీసీ, మ్యాక్‌లలోని బ్రౌజర్లలో మాత్రమే ఇది పని చేస్తుంది.