- హాల్ టికెట్ చూపిస్తే పరీక్ష రాసే విద్యార్థులకు ప్రయాణం ఉచితం
- పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ – ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వెల్లడి
ఏపీలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరగనున్నాయి. పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఉచిత ప్రయాణం సదుపాయం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు జయప్రదంగా పదో తరగతి పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. తల్లితండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంగ్ల మాధ్యమంలో 5,64,064 మంది తెలుగు మాధ్యమంలో 51,069 మంది సోమవారం నుంచి పరీక్షలు రాస్తున్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షలకు వెళ్లొచ్చు అని జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వెల్లడించారు.
Share this content:
Post Comment