జనసేన తరఫున మహిళలకు ఉచిత ఆత్మరక్షణ క్లాసులు

విజయవాడ: సెల్ఫ్ డిఫెన్స్ ఏపీ స్టేట్ ఇంచార్జ్ మరియు కృష్ణా డిస్ట్రిక్ట్ చీఫ్ జనసేన ఎం.హెచ్ యూత్ సోషల్ మీడియా ఇంచార్జ్ జగదీష్ ప్రసాద్ జనసేన తరఫున ఉచితంగా విజయవాడనందు మహిళలకు ఆత్మ రక్షణ క్లాసులు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోమని జగదీష్ ప్రసాద్ తెలియజేస్తూ.. నేటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆడపిల్ల కనీసం రక్షణ లేని సమాజం.. ఇలాంటి సమాజంలో ఆడపిల్లకి ఆత్మరక్షణ విద్య అనేది చాలా అవసరం.. మార్షల్ ఆర్ట్స్ మన ప్రాచీన కళ, మన ప్రాచీన కళని మనం మరిచిపోయి వేరే ఆక్టివిటీస్ మీద మన ఆడపిల్లలందరూ దృష్టి పెడుతున్నారు. మన ప్రాచీన కళని మనం మర్చిపోకూడదు.. మన ప్రాచీన కళతో పాటు సమాజంలో జరిగే దాడులు, దౌర్జన్యాలపై ఆడపిల్లగా కనీసం తనను తాను రక్షించుకోవడానికి ఈ ఆత్మ రక్షణ విద్య చాలా అవసరం.. ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలి.. కరాటే మనకు ఆత్మ రక్షణగా ఉంటూ స్పోర్ట్స్ కోటాలో మన ధైర్యాన్ని పెంచుతుంది. మన ఆత్మవిశ్వాసాన్ని పెంచి..ద్రుదంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఈ రోజుల్లో ఏ వార్తలు చూసినా ఆడపిల్లలకు రక్షణ కొరతయింది.. కనీసం మనం ఇలాంటి విద్య నేర్చుకుని మనం మనల్ని రక్షించుకోవాలని జగదీష్ ప్రసాద్ తెలియజేసారు.