కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ప్రారంభం

భీమవరం, యూ.ఎస్ ఎన్నారై వారి ఆత్మీయ సేవా సంస్థ వారి సహకారంతో చేగొండి హరి రామ జోగయ్య ఆశీస్సులతో కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో మండలంలోని తుందుర్రు, గొల్లవాణితిప్ప గ్రామాల్లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను బుధవారం జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మరియు కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినీడి తిరుమల రావు(బాబీ) చేతుల మీదగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబీ గారు మాట్లాడుతూ యూ.ఎస్ ఎన్నారై వారు ఆత్మీయ సేవా సంస్థ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని మరి ముఖ్యంగా మహిళ సాధికారత కోసం ఎంత గానో కృషి చేస్తున్నారు అని అన్నారు. దానిలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో మొదటి విడతగా తుందుర్రు, గొల్లవాణితిప్ప గ్రామాల్లో 50 చొప్పున వంద కుట్టు మిషన్లు శిక్షణ కాలం పూర్తి అయిన అనంతరం అందిస్తారు అని అన్నారు. త్వరలో భీమవరంలో బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్స్ ఉచిత శిక్షణ ప్రారంభిస్తారు అని చెప్పారు. విదేశాల్లో ఉంటూ కూడా స్వదేశం మీద ప్రేమతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎన్నారై ఆత్మీయ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ఆరేటి వాసు, తాతపూడి రాంబాబు, సర్పంచ్ తిరుమల యామిని కృష్ణ, కె.ఎస్.ఎస్ పి.ఆర్.ఓ అంబటి విజయ్, కొట్టు సురేష్(మమ్మీ), కోయ సూరయ్య గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.