బైరిపురం జనసేన ఆధ్వర్యంలో ఉచిత మూత్ర పిండ పరీక్షలు

ఇచ్ఛాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కవిటి మండలలోని బైరిపురం గ్రామంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి నాయకత్వంలో మరియు బైరిపురం గ్రామ జనసైనికులు బందరు మహేష్, బొర్ర మహేష్, సహాయ సహకారాలతో శాంతి డయాగ్నొస్టిక్ సెంటరు వారి సౌజన్యంతో ఉచిత మూత్రపిండ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు, జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, లోళ్ళ రాజేష్ మరియు బైరిపురం గ్రామ పెద్దల చేతుల మీదుగా ప్రారంభించారు. సుమారు 120 మందికి రక్త నమూనాలు సేకరించి, ఉచితంగా మూత్రపిండ పరీక్షలు నిర్వహించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఉద్ధాన ప్రాంతంలో సుమారు 40,000 మందికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది గమనించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గళమెత్తారు.. అయినా కూడా ఆయన మాటలు ఈ ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వము చేయవలసిన పని జనసైనికులు చేస్తున్నారని ఇప్పటికైనా అధికార ప్రభుత్వం కళ్ళు తెరచి ప్రతీ 3 నెలలకు ఒకసారి మూత్రపిండం పరీక్షలు నిర్హించవలసినదిగా జనసేన తరపున కోరడం జరిగింది.