మహనీయుల త్యాగఫలితమే స్వాతంత్రం: ఆదాడ మోహనరావు

  • జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ..

76 వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) 42వ డివిజన్ కామాక్షినగర్ లో మువ్వన్నెల వజ్రోత్సవ పతాక ఆవిష్కరణ నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్యవేదిక అధ్యక్షులు, ప్రజాగాయకుడు అదాడ మోహనరావు జండా ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆదాడ మోహన్ రావు మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే ఈ స్వతంత్రమని అని అన్నారు. అలాంటిది మనమే చేతకాని నాయకుల చేతుల్లో పెట్టి బందీలుగా వుంటున్నామని అభిప్రాయపడ్డారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండినా కడుపు నింపే రైతుల చావులు తగ్గలేదని, పేదరికం ఇంకా పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాసేవకు నిస్వార్థంతో, పార్టీ సిద్ధాంతాలతో ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ ను మరియు జనసేన పార్టీ ని ప్రజలందరూ ఆదరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు డోల రాజేంద్రప్రసాద్, నాయకులు వంక నరసింగరావు,డాక్టర్ ఎస్. మురళీమోహన్, జనసేన యువనాయకులు, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి లోపింటి కళ్యాణ్, దువ్వి రాము, బూడి వాసు, శీర కుమార్, గురుబిల్లి రాజేష్, నలమహారాజు, రత్నాకర్ అడబాల వెంకటేష్ నాయుడు,రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *